Tuesday, 31 January 2017

మై కోట్స్ (4)

" డబ్బు, ఆస్తులు, అంతస్తులు, చదువులు, బంధాలు - బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు ఎన్ని ఉన్నా కూడా, వ్యక్తికి తన జీవితంలో కనీస స్వేచ్ఛా- స్వతంత్రత లేకపోతే, అవి అన్నీ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి జీవితం ఒక బానిస జీవితంతో సమానం. "
# జె. శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®™Monday, 30 January 2017

మై కోట్స్ (3)

" ఎల్లప్పుడూ అబద్ధాలు చెబుతూ అందర్నీ మోసం చేసే వ్యక్తికి, ఎదుటివారు చెప్పే నిజాలు అబద్దపు మాటలుగా తోచడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇలాంటివారు ఆ సత్య హరిశ్చంద్రుని మాటలను కూడా నమ్మలేరు. "
# జె శ్వేతాగోదావరి (జక్క శ్వేత)©®Thursday, 19 January 2017

నాకు వజ్రాలు దొరికాయోచ్....

నాకు వజ్రాలు దొరికాయోచ్...!!!  :)
నిజమేనండి.. మా పెరట్లోనే... :) గత నెలలో.
ఉదయం నిద్రలేచి బయటికి వచ్చి బ్రష్ చేసుకుంటూ ఉండగా..మా పెరట్లోని పచ్చని గడ్డి వైపు నా దృష్టి పడింది. ముందే చలికాలం.. రాత్రి కురిసిన పొగమంచు వల్ల ఆ పచ్చని గడ్డిపై మెరుస్తున్న వజ్రాల్లాంటి నీటి బిందువులు(హిమ బిందువులు) కనిపించాయి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు ఆ నీటి బిందువులపై పడి, అవి నిజంగా వజ్రాలేమోనన్న అనుమానం ఒక్క సెకను కాలం పాటు నాకు కల్గింది. ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన దృష్యాన్ని నా కెమారాలో బంధించాను. వీటి కన్నా అమూల్యమైన వజ్రాలు ఇంకెక్కడ దొరకుతాయి చెప్పండి. బావున్నాయి కదా!!!! ☺☺
బంగారు వర్ణంలో మెరుస్తూ ఎంత అద్భుతంగా ఉందో కదా!!!