Tuesday, 22 May 2018

కనిపించే ఆ చిరునవ్వు వెనక...













Dedicated to my friend Aruna

కనిపించే ఆ నవ్వు వెనక కనబడని బాధలెన్నో,
విరిసే నీ మోము వెనక కనిపించని కన్నీళ్ళెన్నో,
నీ మాటల గలగలలో దాగిన చెప్పలేని రోదనెంతో,
అందరినీ ప్రేమించే నీ మనసులో కొలవలేని దుఃఖసాగరము లోతెంతో,
నువ్వొక తెరిచిన పుస్తకమని అందరునుకున్నా,
అందులోని చాలా పేజీలు నువ్వు దాచావని నాకు తెలిసినా,
అన్ని కష్టాలను కప్పివుంచే నీ చిరునవ్వు,
మదిలోని తుఫాను అలజడులకు చెదరని నీ గుండె ధైర్యం,
బాధలన్నిటినీ అధిగమించగల నీ ఆత్మబలం,
ఎల్లవేళలా నీ వెంటే ఉండాలని కోరుతూ...

- శ్వేత జక్క ( జె శ్వేతాగోదావరి )













No comments: